Jalleda.com గురించిన తాజా సమాచారం
Bullet (black) RSS icon
 • మీరు తెలుగు బ్లాగుల్లో చేసిన వ్యాఖ్యలు ట్రాక్ చెయ్యటం

   

  తెలుగులో బ్లాగులు రెండు వేలు దాటి శర వేగంతో ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటి వరకు మన వాళ్లు సుమారుగా 80,000 టపాలు, అనగా అక్షరాలా యనభై వేల టపాలు వ్రాశారు. ఇంకా మన బ్లాగ్ పాఠకులు సుమారుగా మూడున్నర లక్షల వ్యాఖ్యలు వ్రాశారు! అనగా రమారమి ఒక్కొక్క టపాకు నాలుగు వ్యాఖ్యలు వస్తున్నాయి. మన బ్లాగ్ పాఠకులు తీరిక సమయాల్లో బ్లాగులు చదువుతూ నచ్చినప్పుడు, నచ్చనప్పుడు, మూడ్ ఉన్నప్పుడు వ్యాఖ్యలు వివిధ బ్లాగుల్లో వ్రాస్తున్నారు. కానీ ఈ వ్యాఖ్యలకు బ్లాగ్ రచయిత గానీ, లేదా మరో బ్లాగ్ పాఠకుడు గానీ సమాధానం ఇచ్చినాడో లేదో అని ట్రాక్ చెయ్యటం కూసింత కష్టంగా ఉన్నట్టుంది. నిజానికి ఈ పనిని జల్లెడను ఉపయోగించుకోని తేలిక చేసుకోవచ్చు. వివరంగా ఈ దిగువ ఇస్తున్నాము పరిశీలించి వాడి మీ అభిప్రాయాలు చెప్పగలరు.

   

  ఒక్కా ఓ చెలియా :

   

  ముందుగా http://jalleda.com నకు వెళ్లి కొంచెం పేజీ దిగువకు వచ్చి ఎడమ వైపున శోధన పెట్టె ఉంది చూడండి.

  jalledaTrackComments1

   

  రెండు రోకళ్లు :

  ఆ తరువాత ఆ శోధన పెట్టెలో మీరు

  “రచయిత వ్యాఖ్యలు: AUTHOR_NAME”

  అని టైప్ చేసి అన్వేషించండి. ఇక్కడ AUTHOR_NAME అని ఉన్న దగ్గర మీ పేరు టైప్ చేసుకోండి. (మీ పేరు అంటే మీరు వివిధ బ్లాగుల్లో వ్యాఖ్యానించేటప్పుడు వాడే పేరన్నమాట. ఉదాహరణకు నేను జాలయ్య పేరుతో అన్వేషిస్తే వచ్చిన ఫలితాలు చూడండి.

   

   jalledaTrackComments2

  మూడు ముద్దబంతి :

  ఈ ఫలితాల్లో మొదటిది మీరు ఇప్పటి వరకు చేసిన వ్యాఖ్యలు అయి ఉంటాయి. లేకుంటే రెండు మూడు ఫలితాలు కూడా పరిశీలించగలరు. ఈ విధంగా మీరు ఎక్కడెక్కడ ఎప్పుడు వ్యాఖ్యానించారో చూసి ఆయా పేజీలకు వెళ్లి మీకు ఏమన్నా రిప్లైలు వచ్చాయేమో చూసుకోవచ్చు.

   

  ఆనంద జాల విహారం.

  meeru-telugu-blaagullO-cha

 • ప్రవేశ పెడుతున్నాం http://top.jalleda.com !

   

  ప్రవేశ పెడుతున్నాం http://top.jalleda.com

   

  జల్లెడలో నచ్చిన టపాలకు ఫైవ్ స్టార్లు, నచ్చని టపాలకు సింగిల్ స్టార్లు ఇవ్వవచ్చునన్న విషయం మీకు తెలుసు. అలాగే ఇప్పటి వరకు, ఈ వారం టాప్ టపాలు చూడాలంటే http://www.jalleda.com/index.php?order=7 అనే లింకు నొక్కి చూసుకోవచ్చు. కాని ఈ లింకు గుర్తు ఉంచుకోవటం కష్టంగా ఉంది. అందుకని http://top.jalleda.com అనే కొత్త చిన్న అర్థవంతమైన ఉప డొమైన్ సృష్ఠించాము.

   

  ఇక నుండి ఈ వారం టాప్ టపాలు చూసుకోవాలంటే దర్శించండి. http://top.jalleda.com

  pravESa-peDutunnaaM-httptop-jalleda-com

 • జల్లెడ ఇప్పుడు ట్విట్టర్ పై

  ఇప్పుడు జల్లెడ గురించిన తాజా సమాచారం ట్విట్టర్ పై!

  http://twitter.com/jalleda

  jalleDa-ippuDu-TviTTar

 • జల్లెడ క్రొత్త రూపు

  మీరు మెచ్చిన జల్లెడ, ఇప్పుడు మీకోసం మరింత ఆహ్లాదకరమైన రూపంతో సిద్దమయింది. కేవలం క్రొత్తరూపే కాకుండా జల్లెడ ఉపయోగశీలత పెంపొందించడానికై కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. ఈ దఫాలో చేసిన కొన్ని మార్పులు

  1. క్రొత్త రూపం

  image

  2. స్థితి పట్టిక

  జల్లెడలోని టపాలు, వ్యాఖ్యలు జల్లిస్తూ వెళ్లేటప్పుడు మీరు దారి తప్పిపోకుండా ఈ ఏర్పాటు చేయడమైనది.

  image

  3. వేడి పకోడీలను చూపడంలో మరింత మెఱుగైన పద్దతి

  image

  జల్లెడను వాడి మీ అభిప్రాయాలను తెలియజేయండి.

  jalleDa-krotta-roopu

 • జల్లెడ ఇప్పుడు మరిన్ని హంగులతో! వ్యాఖ్యలు, వేగవంతం.

  తెలుగు బ్లాగ్ ప్రపంచానికి సేవ చేయటానికి ఇప్పుడు జల్లెడ మరిన్ని హంగులతో మీ ముదుగు వచ్చింది.

  ఇప్పటివరకూ మీరు టపాలు జల్లెడపై నిరంతర ప్రవాహంలా చదువుతున్నారు, నేటినుండి మీరు తెలుగు బ్లాగర్ల వ్యాఖ్యలు కూడా వెల్లువలా చదవే సౌలభ్యం కలిపాము.

  jcomments1

  ఇంతకు ముందు ఉన్న తొలి కాయితం అనే మీటపైన మరో మీట చేరింది. ఈ తాజా వ్యాఖ్యలు నొక్కి మీరు తాజా తాజా వ్యాఖ్యలు చూడవచ్చు. ఆలాగే అనంతంగా సుమారుగా 80.000, అచ్చరాలా యనబై వేల వ్యాఖ్యల వరకు చదువుతు పోవచ్చు!

  jcomments2అలాగే ప్రతి టపా సమాచారంతో పాటు ఇప్పుడు ఆ టపాకు ఉన్న వ్యాఖ్యల వివరాలు కూడా చూడవచ్చు.

  ఉదాహరణకు కుడి పక్క బొమ్మలో కాలాస్త్రి గారి టపాకు ౧౧ వ్యాఖ్యలు వచ్చాయి.

  అలాగే ఇంకొక ఉపయోగకరమైన ఫీచర్ ఒక రచయిత చేసిన వ్యాఖ్యలు అన్నీ ఒకే పేజీలో చూడవచ్చు!!

  ఉదాహరణకు కుడి పక్క బొమ్మలో రచయిత శ్రీ పక్కన వ్యాఖ్యలు అని ఒక లింకు ఉన్నది చూశారూ, అది నొక్కితే మీకు రచయిత శ్రీ చేసిన అన్ని కామెంట్లు వస్తాయి. మీ పేరు వెతుక్కోని నొక్కి మీరు చేసిన తాతలనాటి కామెంట్లు కూడా ఇలా చూడవచ్చు.

  ఇహ వ్యాఖ్యల పక్కన వచ్చే వివరాల గురించి చిన్న వివరణjcomments41

  టపా \ ఈ లింకు నొక్కితే మీరు ఈ వ్యాఖ్య ఉన్న టపా సమ్మరీకి వెళ్తారు.

  ఇతర వ్యాఖ్యలు \ ఈ లింకు నొక్కితే మీరు ఇదే వ్యాఖ్యతో పాటు , ఇదే టపాపై ఇతర వ్యాఖ్యల పేజీకి వెళ్తారు.

  బ్లాగు లింకు నొక్కితే ఆ బ్లాగుపై ఉన్న అన్ని వ్యాఖ్యలు చూస్తారు.

  వ్యాఖ్యాత లింకు నొక్కితే ఆ వ్యాఖ్యాత ఇతర బ్లాగులపై చేసిన అన్ని వ్యాఖ్యలూ చూస్తారు. వ్యాఖ్యాత పక్కన ఉన్న టపాలు నొక్కితే ఇదే రచయిత బ్లాగు టపాలకు వెళ్తారు.

  ప్రయోగాలు చేసి చూడండి. మీరు ఆనందిస్తారు.

  ఇవే కాకుండా ఇప్పుడు జల్లెడ మరింత వేగవంతం. ముఖ్యంగా పలువురు మెచ్చిన టపాలు, పైన ఉన్న వర్గాలు.

  మీ బ్లాగు ఇంకా జల్లెడలో లేకుంటే నేడే కలపండి.

  మీ సూచనలు ఇవ్వడం మరవకండి.

  jalleDa-ippuDu-marinni-ha

 • జల్లెడలో ఇప్పుడు వెయ్యి తెలుగు బ్లాగులు!

  వెయ్యి వెలుగులు!!

  హజార్ చిట్టా

  థౌజండ్ బ్లాగ్స్

  జల్లెడ ఇప్పుడు వెయ్యి బ్లాగులను జల్లిస్తుంది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

  దర్శించండి, మీ అభిమాన బ్లాగ్ టపాలకు వోట్లు వెయ్యండి. నేడే !  http://jalleda.com

  jalleDalO-ippuDu-veyyi

 • ఉత్తమ తెలుగు "బ్లాగు" టపాల పోటీ

  తెలుగు వారికి నమస్కారం,

  మన తెలుగు బ్లాగులు సుమారు వెయ్యికి పైబడిన బ్లాగులతో, 25000 (అక్షరాలా ఇరవై ఐదు వేల)కి పైబడి టపాలతో దినదినాభివృద్ధి చెందుతున్నాయి. వీటిలో ఇప్పటివరకూ జల్లెడ వర్గీకరించిన లెక్కల ప్రకారం:
  కబుర్లు : 2500 (రెండు వేల ఐదు వందల) పై చిలుకు
  హాస్యం: 1100 (పదకొండొందల) పై చిలుకు
  రాజకీయం: 830 (ఎనిమిది వందల ముప్పై) పై చిలుకు
  కవితలు: 530 (ఐదు వందల ముప్పై) పై చిలుకు
  సాహిత్యం: 2000 (రెండు వేలు)
  ఆధ్యాత్మికం: 320 (మూడు వందల ఇరవై) పై చిలుకు
  స్త్రీ బ్లాగుల నుండి టపాలు: 1600 (పదహారు వందల ) పై చిలుకు
  సాంకేతికం: 630 (ఆరు వందల ముప్పై) పై చిలుకు
  సినిమా విషయాలపై టపాలు: 1000 (వెయ్యి) పై చిలుకు 

  ఇవి కాక వెబ్ పత్రికలలో టపాలు: 2800 (రెండు వేల ఎనిమిది వందల) వరకు.

  (అంటే మన వాళ్లు 15,000 టపాల వరకూ తోకలు చేర్చలేదు :( )

  ఇలా తెలుగు బ్లాగులను మీకు చేరువ చెయ్యడానికి జల్లెడ ద్వారా మేము మా వంతు  కృషి చేస్తున్నాము.

  ఇప్పుడు మీ ముందుకు సవినయంగా సమర్పిస్తున్నాం – “ఉత్తమ తెలుగు ‘బ్లాగు’ టపాల పోటీ.

   

  విభాగాలు :

  * మొదటి మూడు ఉత్తమ బ్లాగులు
  * మొదటి మూడు ఉత్తమ బ్లాగు టపాలు
  * ‘హాస్యం’ విభాగంలో మొదటి మూడు ఉత్తమ బ్లాగు టపాలు
  * ‘రాజకీయం’ విభాగంలో మొదటి మూడు ఉత్తమ బ్లాగు టపాలు
  * ‘కవితలు ‘ విభాగంలో మొదటి మూడు ఉత్తమ బ్లాగు టపాలు
  * ‘సాహిత్యం’ విభాగంలో మొదటి మూడు ఉత్తమ బ్లాగు టపాలు
  * ‘సాంకేతికం’ విభాగంలో మొదటి మూడు ఉత్తమ బ్లాగు టపాలు
  * ‘స్త్రీ బ్లాగుల’ విభాగంలో మొదటి మూడు ఉత్తమ బ్లాగు టపాలు
  * ఇంకా 150 ఉత్తమ బ్లాగుల జాబితా. (కూడలి 100 వంటి వాటికి ఉపయుక్తంగా ఉంటుందని)

  బహుమతులెమిటి? :

  విజేతకి గెలుపే బహుమానం! పేద్ద పేద్ద బహుమతులివ్వాలనుంది కానీ ఆర్దిక కారణాల వల్ల వీలవలేదు. కానీ విజేతలకి అందమైన బొత్తాలు బహుమతిగా ఇస్తాం సుమా!!

  పోటీ పద్దతి:

  బ్లాగులు మొదలయినప్పటినుండి, వోటింగ్ ముగిసే రోజువరకు వ్రాసిన అన్ని బ్లాగులూ పోటీకి అర్హమైనవే!

  పోటీలు ఈ క్షణం నుండే మొదలయినట్టుగా భావించవచ్చు

  ఇప్పటివరకూ జల్లెడలో వేసిన వోట్లు కూడా పరిగణనలోకి తీసుకోబడతాయి.

  ఆగష్టు నెలాఖరు వరకూ జల్లెడపై వేసిన అన్ని ఓట్లూ పరిగణనలోకి తీసుకుంటాము. ఆ తరువాత ప్రతి విభాగంనుండి పది ఉత్తమాంశాలను తరువాతి రౌండ్ కు ప్రమోట్ చేస్తాము. ఈ పది ఉత్తమాంశాలనుండి మొదటి మూడింటినీ జడ్జిలు ఎన్నుకుంటారు. సెప్టంబర్ మూడవవారం ఫలితాల ప్రకటన ఉంటుంది.

  జడ్జిలుగా బ్లాగ్ ప్రపంచంతో పెద్దగా సంబంధంలేని వారిని ప్రయత్నిస్తున్నాము.

  న్యాయ నిర్ణేతలకు విచక్షణాధికారాలున్నాయి.

  టపా మొదటిసారిగా బ్లాగులోనే ప్రచురితం అయి ఉండాలి.

  - తవసం (తరచూ వచ్చే సందేహాలు)

  * నా బ్లాగు జల్లెడలో లేదు. ఎలా?

  - ఇక్కడకి వెళ్లి కలపమని అడగండి.

  * నా బ్లాగు టపాలు సరి అయిన వర్గంలో లేవు. ఎలా?
  - మీ బ్లాగు టపాకి ఇచ్చిన వర్గాలని బట్టి జల్లెడ వర్గీకరణ చేస్తుంది. మీ బ్లాగు టపాకి అసలు వర్గాలే లేకుంటే ఇప్పుడు అర్థవంతమైన వర్గాలు కలపండి. ఒక వేళ వర్గాలు ఉన్నా జల్లెడ వర్గీకరణ సరిగ్గా చెయ్యకపోతే మరో రెండు మూడు అర్థవంతమైన వర్గాలు కలిపి చూడండి.

  * మళ్లా వర్గాలు కలిపితే కూడలిలో వస్తుంది కదా! ఎలా?

  - ఈ ఒక్కసారికీ లెంపలేసుకోని కలిపెయ్యండి.

  * నా బ్లాగునూ బ్లాగు టపాలనూ ఓటింగ్ కోసం ప్రమోట్ చేసుకోవచ్చా?

  - భేషుగ్గా చేసుకోవచ్చు.
  (అ) ఇక్కడ ఉన్న బొత్తాలు మీ బ్లాగులో ఉంచితే మీ బ్లాగు సందర్శకులు నేరుగా మీ టపాలకు వెళ్లి వోటు వెయ్యవచ్చు.

   

   

   jalledaScreen

   

  (ఆ) జల్లెడలో ఉన్న ఒక కూల్ ఫీచర్ ఏమిటంటే ప్రతి బ్లాగు, ప్రతి రచయిత, ప్రతి బ్లాగు టపా, కూడా శాశ్వత లంకె కలిగి ఉంటుంది. ఈ లంకెని ఉపయోగించి మీరు మీ బ్లాగును ప్రమోట్ చేసుకోవచ్చు. (పై చిత్రంలో కుడివైపున చూడండి. )

  తెర తీశాం.
  పోటీ మొదలయింది.
  విజేతలెవ్వరు?

  uttama-telugu-blaagu-Tapaa

 • 24,500 టపాలు!!

  ఇరవై నాలుగు వేల ఐదు వందల టపాలు!!

  ఎక్కడ? ఎక్కడ??
  ఏ బ్లాగులో అనుకుంటున్నారా?

  ఒక్క బ్లాగులో కాదండీ, అన్ని తెలుగు బ్లాగుల్లో కలిపి. ప్రస్తుతం జల్లెడలో ఉన్న అన్ని తెలుగుబ్లాగులు కలిపి సుమారుగా ఇరవై నాలుగు వేల ఐదువందల టపాలు ఉన్నాయి.

  ఇవి అన్నీ చదవాలంటే ఎన్ని దినాలు పడుతుందో కదా!

  ఇంకా ఇవి కాకుండా పత్రికల వర్గంలో సుమారుగా 2,300 టపాలు ఉన్నాయి. (పొద్దు, ఈమాట, భూమిక, నవతరంగం, ప్రజాకళ వంటి వెబ్ జైన్లు ఈ వర్గంలో ఉంటాయని మీకు విదితమే)

  మరిన్ని లెక్కా పత్రాలు త్వరలో… అంతవరకూ ఈ తెలుగు సముద్రంలో ఈత ట్రై చెయ్యండి, ఒడ్డున ఉండేవారిని సముద్రంలో లాగడమెలాగో ఆలోచించండి.

  Visit : http://jalleda.com

  24500-Tapaalu

 • జల్లెడలో వోటింగ్ : విశేషాలూ, వివరాలూ

  Visit now http://jalleda.com to cast your vote for awesome Telugu blogs!

  జల్లెడ మొదలుపెట్టినప్పుడు తక్షణ కర్తవ్యం పాత బ్లాగు టపాలను కూడా ఓ చోట ప్రదర్శించడం. తద్వారా ఎప్పుడూ కొత్తవి మాత్రమే పాఠకులకు కనిపించి పాతవి మరుగునపడిపోకుండా ఉండే అవకాశం కలిగించడం. ఈ లక్ష్యాన్ని చేరుకోగానే మరో చాలంజ్ కనిపించింది! పాత టపాలు కేవలం తేదీలవారీగా చూపిస్తే ఆ సముద్రంలో ఆణిముత్యాలను, వజ్రాలను ఏరుకోవడం ఎలా? ఈ విషయంలో ఉపయుక్తంగా ఉంటుందని జల్లెడలో వోటింగ్ ఫీచరును కోడ్ చేశాము.

  మొదట వోటింగ్ ఏర్పాటు చేయగానే మేము చాలా ఎక్సైట్ అయినాము. కానీ దీనిలో ఓ కిటుకు నన్ను ఎక్కువగా ఆలోచనలో పడేసింది.

  ఏదన్నా టపాకు ఐదుగురు ఫైవ్ స్టార్ (ఐదు నక్షత్రాల) రేటింగ్ ఇచ్చి, మరో టపాకు కేవలం ఒకే ఒక ఐదు నక్షత్రాల రేటింగ్ వస్తే ముందుగా మొదటిది చూపాలి, కానీ మేము ఒకే వోటు విలువ ఉన్నవాటిని తారీకుల వారీగా చూపడంతో మొదటి టపా కిందపడిపొయ్యే సంభావ్యత ఎక్కువే ఉండి ఉండెను.

  ఏదన్నా టపాకు నలుగురు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి, ఒకరు ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చి, మరో టపాకు కేవలం రెండు ఫైవ్ స్టార్ రేటింగ్ వస్తే ముండు ఏ టపా చూపాలి? మొదటి దానికి నాలుగు ఐదు నక్షత్రాలు, ఒక నాలుగు నక్షత్రాలు వచ్చినాయి కనుక సరాసరి 4.8 అవుతుంది, రెండో దానికి కేవలం రెండు ఐదు నక్షత్రాలు వచ్చినాయి అయినా సరాసరి 5.0 నే అవుతుంది. అలా కేవలం సరాసరినే ఆధారంగా చూపితే రెండోది మొదట చూపాల్సి వస్తుంది . కానీ మొదటిదే నాణ్యమైన టపా కదా!

  ఇహ అన్నిటికంటే ప్రమాదకరమైన కిటుకు, మీ టపా పైన రావాలంటే మీ పైన ఉన్న టపాకు ఒక నక్షత్రం వోటు వేస్తే చాలు!  మన బ్లాగు పాఠకులు మంచోళ్లు కాబట్టి ఈ సమస్య ఎక్కువగా ఎదురవలేదు కానీ కొన్ని ఒకటీ రెండు మినహాయింపులు ఉన్నాయి సుమా! రేపటి సంగతి ఎలా ఉంటుందో తెలీదు కదా!

  ఐదు ఒకే నక్షత్రం వోటు వచ్చిన టపాకన్నా ఒకే ఒక నక్షత్రం వోటు వచ్చిన టపా మెరుగు కదా!

  ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మరో మంచి అల్గారిదం డిజైన్ చేశాం.

  #దీనిలో ప్రతి వోటుకూ బోనస్ ఉంటుంది.
  #ఒకరు వేసే వోటు మెజారిటీ జనాల అభిప్రాయంతో ఏకీభవిస్తేనే బోనస్ వస్తుంది.
  #బోనస్ ధనాత్మకం, ఋణాత్మకం గా ఉంటుంది.
  #ఐదు నక్షత్రాలకు 0.2, నాలుగు నక్షత్రాలకు 0.1, మూడు నక్షత్రాలకు 0.0, రెండు నక్షత్రాలకు -0.1, ఒక నక్షత్రానికి -0.2. అనేవి బోనస్ విలువలు.

  ఇప్పుడు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం:

  ఒక టపాకు ఐదు ఒక నక్షత్రం వోట్లు వచ్చాయి అనుకోండి, మరో టపాకు కేవలం ఒకే ఒక నక్షత్రం వోటు వచ్చింది అనుకోండి, కేవలం సరాసరి మాత్రమే లెక్కేస్తే రెంటి విలువా 1.0 నే ఉంటుంది. కానీ మన బోనస్ తరువాత కలిపితే మొదటి టపాకు ఐదు ఒక నక్షత్రం వోట్లు అనగా బోనస్ 5 * -0.2 = -1.0 , కనుక చివరి వోటు విలువ 0.0 అవుతుంది, రెండో టపాకు బోనస్ 1 * -0.2 = -0.2, చివరి వోటు విలువ 1.0 – 0.2 = 0.8 అవుతుంది, ఈ లెక్కన రెండో టపా నెగ్గింది.

  మరో ఉదాహరణ ఒక టపాకు నాలుగు ఐదు నక్షత్రాలు , ఒక ఒక నక్షత్రం వోటు వచ్చాయనుకోండి, పాత లెక్క ప్రకారం దాని వోటు విలువ 4.80 కానీ దానికి బోనస్ కలిపితే 4 * 0.2 = 0.8 + 1 * 0.0 = 0.8. ఒక నక్షత్రానికి బోనస్ రాదు, ఎందుకంటే మెజార్టీ ప్రజలు ఆ టపా బాగుంది అని అన్నారు కదా! ఒక నక్షత్రం వోటు మైనార్టీలో పడి బోనస్ కి ఎలిజిబుల్ కాదన్న మాట. ఇప్పుడు 4.80 + 0.80 = 5.60 అనేది చివరి వోటు విలువ అవుతుంది.

  —–

  మొత్తం అంతా కన్ఫ్యూజింగ్ గా ఉన్నదా? మరీ కాంప్లెక్స్ గా ఉన్నదా? సిల్లీగా ఉన్నదా? ఓవర్ ఇంజినీరింగ్ గా ఉన్నదా?

  అన్నీ మర్చిపోండి, మీకు నచ్చిన టపాలకు / నచ్చని టపాలకూ వోట్లు వెయ్యండి 5 నుండి 1 వరకూ.

  ఎక్కువ మందికి నచ్చినవి పైన తేల్తాయి అని భరోసా ఉంచండి.

  ——

  మేము ఎప్పటికప్పుడు జల్లెడను మెరుగు పరచడానికి మెదళ్లను సానపడుతున్నామని మాత్రం హామీ ఇస్తున్నాము.

  ——

  అసలు వోటింగ్ వల్ల లాభాలు ఏమిటి?

  అసలు వోటింగ్ ఎందుకు అనే ప్రశ్న మమ్మళ్ని కొంత మంది మితృలు అడిగారు.

  #కేవలం తేదీలవారీగానే కాకుండా నాణ్యతా ప్రమాణాల ప్రకారం కూడా టపాలను చూపడం.
  # రోజూ బ్లాగులు చదివే మనబోటి వారయితే పర్వాలేదు కానీ మనం ఎవరన్నా మితృనికి బ్లాగులున్నాయి, తెలుగులో వ్రాస్తుంటారు కావాలంటే చదువు అని చెప్పినప్పుడు అప్పటికప్పుడు ర్యాండంగా చూపడం కంటే ముందే పలువురు మెచ్చినవి చూపితే బాగుంటుంది కదా!
  #మన టపాలలో ఏవి ఎక్కువ వోట్లు పొందాయో తెలుసుకోవచ్చు, వాటిని మనకు తెల్సినవారికి ముందుగా చదవమని చెప్పొచ్చు. ఇలా ఒక బ్లాగు / రచయిత టపాల్లో ఎక్కువ వోట్లు ఏవి పొందాయో తెల్సుకోవాలంటే ఆ రచయిత ఏదన్నా టపాని జల్లెడపై గమనించి, దానిలో కుడివైపున ఉన్న బ్లాగు: / రచయిత: పక్కనున్న బులుగు రంగు లింకుపై (బ్లాగు పేరు/రచయిత పేరు వ్రాసి ఉన్న లింకులు) నొక్కి చూడండి, ఇప్పుడు కేవలం ఆ బ్లాగు నుండి లేదా ఆ రచయిత నుండి మాత్రమే టపాలు కనిపిస్తాయి. ఆ తరువాత ఎడమవైపు పలువురు మెచ్చినవి అని ఉన్న లింకు నొక్కండి, అంతే ఆ బ్లాగులో ఎక్కువ వోట్లు వచ్చిన టపాలు కనిపిస్తాయి.

  # పై ఫీచర్ ఎక్కువ మందికి తెలీదు అనిపిస్తుంది. ఓ సారి ట్రై చేసి చూడగలరు.
  # అంతే కాకుండా ఏ వర్గంలో ఉండినప్పుడయినా మీరు పలువురు మెచ్చినవి అన్న లింకు నొక్కితే కేవలం ఆ వర్గంలో ఎక్కువ వోట్లు వచ్చిన బ్లాగుటపాలు కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు స్త్రీ వర్గం నొక్కి అది ఓపెన్ అయిన తరువాత పలువురు మెచ్చినవి లింకు నొక్కితే కేవలం స్త్రీ బ్లాగు టపాల్లోనే ఉత్తమ టపాలు కనిపిస్తాయి! ఇదే విధంగా మంచి కవితలు, మంచి హాస్యం టపాలూ చూడవచ్చు!!!

  #అలాగే మీరు ఏ తోకపై నొక్కినా (అనగా బ్లాగు టపా సమ్మరీ పక్కన కుడివైపు కన్పించే వర్గం లింకులు ) ఆ తరువాత పలువురు మెచ్చినవి నొక్కితే కేవలం ఆ తోకలో ఉత్తమ టపాలు మీకు ప్రత్యక్ష్యం!!

  —-

  సదా మీ సేవలో

  —-

  అయితే ఈ వోటింగ్ మెరుగైన ఫలితాలు చూపాలంటే ఎక్కువ మంది వోటింగ్ ప్రక్రియలో పాల్గొనాలి.

  మీరు టపాలకు నేడే జల్లెడపై వోట్లు వెయ్యండి, జల్లెడ మరింత మెరుగ్గా జల్లించడంలో ఓ చెయ్యి వేయండి.

  —–

  చివరగా ఓ మాట కుకీలు డిలీట్ చేసి వోటు మళ్లా మళ్లా వేసినా జల్లెడ రోజువారీ క్లీన్ అప్ లో ఆ దొంగ వోట్లు అన్నీ పక్కకి నెట్టివేయబడుతాయి అని మనవి.

  అయితే ఈ వోటింగ్ మెరుగైన ఫలితాలు చూపాలంటే ఎక్కువ మంది వోటింగ్ ప్రక్రియలో పాల్గొనాలి.

  మీరు టపాలకు నేడే జల్లెడపై వోట్లు వెయ్యండి, జల్లెడ మరింత మెరుగ్గా జల్లించడంలో ఓ చెయ్యి వేయండి.

  Visit now http://jalleda.com

  jalleDalO-vOTiMg-viSEshaa

 • మహిళలకు మాత్రమే ప్రవేశం (మహిళా బ్లాగర్ల మీట)

  జల్లెడలో మహిళల కోసం ఓ ప్రత్యేక వర్గం ఏర్పాటు చేసినట్టు మీకు విదితమే. ఆ వర్గాన్ని మీ మీ సైట్లలో ప్రమోట్ చేసుకోడానికిప్పుడో అందమైన మీట/బొత్తం.

  ప్రస్తుతానికి 25 మంది మహిళా బ్లాగర్లే ఉన్నా వారి సంఖ్యను ఇతోధికంగా పెంచి ఆకాశంలో సగం అని బ్లాగ్ప్రపంచంలో (సుమారుగా ఇంకో 800 మంది కావాలి!)  కూడా సగం అని నిరూపించుకుంటారని ఆశిస్తూ

  జల్లెడ బృందం. 


  <a href="http://jalleda.com/jcustcat.php?catid=7" mce_href="http://jalleda.com/jcustcat.php?catid=7"><img border=0 src="http://www.jalleda.com/images/jmahila.png" mce_src="http://www.jalleda.com/images/jmahila.png" alt="మహిళా బ్లాగర్లు ">
  </a>

  ఈ పై డబ్బాలోని కోడ్ మీ సైడ్ బారులో అతికిస్తే మీకు క్రింద చూపిన విధంగా అందమైన బొత్తం ప్రత్యక్ష్యం అవుతుంది. దానిని నొక్కితే మీ చదువరులు నేరుగా మహిళా బ్లాగర్ల వర్గానికి వెళ్తారు.

  మహిళా బ్లాగర్లు

  Visit :  http://jalleda.com/

  mahiLalaku-maatramE-pravESaM

RTSMirror Powered by JalleDa