Jalleda.com గురించిన తాజా సమాచారం
Bullet (black) RSS icon
  • ప్రవేశ పెడుతున్నాం http://top.jalleda.com !

     

    ప్రవేశ పెడుతున్నాం http://top.jalleda.com

     

    జల్లెడలో నచ్చిన టపాలకు ఫైవ్ స్టార్లు, నచ్చని టపాలకు సింగిల్ స్టార్లు ఇవ్వవచ్చునన్న విషయం మీకు తెలుసు. అలాగే ఇప్పటి వరకు, ఈ వారం టాప్ టపాలు చూడాలంటే http://www.jalleda.com/index.php?order=7 అనే లింకు నొక్కి చూసుకోవచ్చు. కాని ఈ లింకు గుర్తు ఉంచుకోవటం కష్టంగా ఉంది. అందుకని http://top.jalleda.com అనే కొత్త చిన్న అర్థవంతమైన ఉప డొమైన్ సృష్ఠించాము.

     

    ఇక నుండి ఈ వారం టాప్ టపాలు చూసుకోవాలంటే దర్శించండి. http://top.jalleda.com

    pravESa-peDutunnaaM-httptop-jalleda-com

  • జల్లెడలో ఇప్పుడు వేడి పకోడీలు! మరియు మేఘాలు

    నిరంతర వాహినిలా వస్తున్న తెలుగు బ్లాగుల నుండి వేడి వేడి పకోడీలు ఏరి జల్లెడలో ఇస్తున్నాం. పరిశీలించి మీ అభిప్రాయం చెప్పగలరు.

     ఇంకా మేఘాలు కూడా ఇస్తున్నాం. పరిశీలించగలరు.

    jalleDalO-ippuDu-vEDi-paka

  • RTS Mirror – word press plugin vext version 1.1 released

    It is almost one year we first released RTSMirror plugin for wordpress self hosted people. Still it is working good!

    When we released this plugin the version of wordpress is 2.2 now it is 2.7.

    These are the changes in new release

    1. Tested on wordpress 2.7.

    2. Fixed a bug reported by poddu people. Now we give link to Telugu script in RTS page and vice-versa. Previously we used to give only RTS link always.

    3. Now we display Title instead of a static string (RTS Perm Link,  in previous versions now Title of page in Telugu and RTS )

    4. RTSMirror widget is now more intuitive.

    Visit RTSMirror Home page to download and install instructions. Make sure you added widget in appearance page.

    Incase you own a wordpress self hosted domain, install and see it in action.

    One can play around RTS feature on this blog to see this in action.

    Advantages:

    1. One who can not read Telugu script can still read your blog in roman script.

    2. If ones machine doesn’t display Telugu script properly still your blog can be read. (for example somebody on mobile!)

    3. if somebody is searching for Telugu content in English script your blog is visible!

    People who are already using this, please share your feedback here. Also it will be great if you can give us stats of how many more people visited your blog through search engines via RTS content.

    rts-mirror-word-press-plugin-vext-version-11-released

  • జల్లెడ ఇప్పుడు మరిన్ని హంగులతో! వ్యాఖ్యలు, వేగవంతం.

    తెలుగు బ్లాగ్ ప్రపంచానికి సేవ చేయటానికి ఇప్పుడు జల్లెడ మరిన్ని హంగులతో మీ ముదుగు వచ్చింది.

    ఇప్పటివరకూ మీరు టపాలు జల్లెడపై నిరంతర ప్రవాహంలా చదువుతున్నారు, నేటినుండి మీరు తెలుగు బ్లాగర్ల వ్యాఖ్యలు కూడా వెల్లువలా చదవే సౌలభ్యం కలిపాము.

    jcomments1

    ఇంతకు ముందు ఉన్న తొలి కాయితం అనే మీటపైన మరో మీట చేరింది. ఈ తాజా వ్యాఖ్యలు నొక్కి మీరు తాజా తాజా వ్యాఖ్యలు చూడవచ్చు. ఆలాగే అనంతంగా సుమారుగా 80.000, అచ్చరాలా యనబై వేల వ్యాఖ్యల వరకు చదువుతు పోవచ్చు!

    jcomments2అలాగే ప్రతి టపా సమాచారంతో పాటు ఇప్పుడు ఆ టపాకు ఉన్న వ్యాఖ్యల వివరాలు కూడా చూడవచ్చు.

    ఉదాహరణకు కుడి పక్క బొమ్మలో కాలాస్త్రి గారి టపాకు ౧౧ వ్యాఖ్యలు వచ్చాయి.

    అలాగే ఇంకొక ఉపయోగకరమైన ఫీచర్ ఒక రచయిత చేసిన వ్యాఖ్యలు అన్నీ ఒకే పేజీలో చూడవచ్చు!!

    ఉదాహరణకు కుడి పక్క బొమ్మలో రచయిత శ్రీ పక్కన వ్యాఖ్యలు అని ఒక లింకు ఉన్నది చూశారూ, అది నొక్కితే మీకు రచయిత శ్రీ చేసిన అన్ని కామెంట్లు వస్తాయి. మీ పేరు వెతుక్కోని నొక్కి మీరు చేసిన తాతలనాటి కామెంట్లు కూడా ఇలా చూడవచ్చు.

    ఇహ వ్యాఖ్యల పక్కన వచ్చే వివరాల గురించి చిన్న వివరణjcomments41

    టపా \ ఈ లింకు నొక్కితే మీరు ఈ వ్యాఖ్య ఉన్న టపా సమ్మరీకి వెళ్తారు.

    ఇతర వ్యాఖ్యలు \ ఈ లింకు నొక్కితే మీరు ఇదే వ్యాఖ్యతో పాటు , ఇదే టపాపై ఇతర వ్యాఖ్యల పేజీకి వెళ్తారు.

    బ్లాగు లింకు నొక్కితే ఆ బ్లాగుపై ఉన్న అన్ని వ్యాఖ్యలు చూస్తారు.

    వ్యాఖ్యాత లింకు నొక్కితే ఆ వ్యాఖ్యాత ఇతర బ్లాగులపై చేసిన అన్ని వ్యాఖ్యలూ చూస్తారు. వ్యాఖ్యాత పక్కన ఉన్న టపాలు నొక్కితే ఇదే రచయిత బ్లాగు టపాలకు వెళ్తారు.

    ప్రయోగాలు చేసి చూడండి. మీరు ఆనందిస్తారు.

    ఇవే కాకుండా ఇప్పుడు జల్లెడ మరింత వేగవంతం. ముఖ్యంగా పలువురు మెచ్చిన టపాలు, పైన ఉన్న వర్గాలు.

    మీ బ్లాగు ఇంకా జల్లెడలో లేకుంటే నేడే కలపండి.

    మీ సూచనలు ఇవ్వడం మరవకండి.

    jalleDa-ippuDu-marinni-ha

  • ఉత్తమ తెలుగు "బ్లాగు" టపాల పోటీ

    తెలుగు వారికి నమస్కారం,

    మన తెలుగు బ్లాగులు సుమారు వెయ్యికి పైబడిన బ్లాగులతో, 25000 (అక్షరాలా ఇరవై ఐదు వేల)కి పైబడి టపాలతో దినదినాభివృద్ధి చెందుతున్నాయి. వీటిలో ఇప్పటివరకూ జల్లెడ వర్గీకరించిన లెక్కల ప్రకారం:
    కబుర్లు : 2500 (రెండు వేల ఐదు వందల) పై చిలుకు
    హాస్యం: 1100 (పదకొండొందల) పై చిలుకు
    రాజకీయం: 830 (ఎనిమిది వందల ముప్పై) పై చిలుకు
    కవితలు: 530 (ఐదు వందల ముప్పై) పై చిలుకు
    సాహిత్యం: 2000 (రెండు వేలు)
    ఆధ్యాత్మికం: 320 (మూడు వందల ఇరవై) పై చిలుకు
    స్త్రీ బ్లాగుల నుండి టపాలు: 1600 (పదహారు వందల ) పై చిలుకు
    సాంకేతికం: 630 (ఆరు వందల ముప్పై) పై చిలుకు
    సినిమా విషయాలపై టపాలు: 1000 (వెయ్యి) పై చిలుకు 

    ఇవి కాక వెబ్ పత్రికలలో టపాలు: 2800 (రెండు వేల ఎనిమిది వందల) వరకు.

    (అంటే మన వాళ్లు 15,000 టపాల వరకూ తోకలు చేర్చలేదు :( )

    ఇలా తెలుగు బ్లాగులను మీకు చేరువ చెయ్యడానికి జల్లెడ ద్వారా మేము మా వంతు  కృషి చేస్తున్నాము.

    ఇప్పుడు మీ ముందుకు సవినయంగా సమర్పిస్తున్నాం – “ఉత్తమ తెలుగు ‘బ్లాగు’ టపాల పోటీ.

     

    విభాగాలు :

    * మొదటి మూడు ఉత్తమ బ్లాగులు
    * మొదటి మూడు ఉత్తమ బ్లాగు టపాలు
    * ‘హాస్యం’ విభాగంలో మొదటి మూడు ఉత్తమ బ్లాగు టపాలు
    * ‘రాజకీయం’ విభాగంలో మొదటి మూడు ఉత్తమ బ్లాగు టపాలు
    * ‘కవితలు ‘ విభాగంలో మొదటి మూడు ఉత్తమ బ్లాగు టపాలు
    * ‘సాహిత్యం’ విభాగంలో మొదటి మూడు ఉత్తమ బ్లాగు టపాలు
    * ‘సాంకేతికం’ విభాగంలో మొదటి మూడు ఉత్తమ బ్లాగు టపాలు
    * ‘స్త్రీ బ్లాగుల’ విభాగంలో మొదటి మూడు ఉత్తమ బ్లాగు టపాలు
    * ఇంకా 150 ఉత్తమ బ్లాగుల జాబితా. (కూడలి 100 వంటి వాటికి ఉపయుక్తంగా ఉంటుందని)

    బహుమతులెమిటి? :

    విజేతకి గెలుపే బహుమానం! పేద్ద పేద్ద బహుమతులివ్వాలనుంది కానీ ఆర్దిక కారణాల వల్ల వీలవలేదు. కానీ విజేతలకి అందమైన బొత్తాలు బహుమతిగా ఇస్తాం సుమా!!

    పోటీ పద్దతి:

    బ్లాగులు మొదలయినప్పటినుండి, వోటింగ్ ముగిసే రోజువరకు వ్రాసిన అన్ని బ్లాగులూ పోటీకి అర్హమైనవే!

    పోటీలు ఈ క్షణం నుండే మొదలయినట్టుగా భావించవచ్చు

    ఇప్పటివరకూ జల్లెడలో వేసిన వోట్లు కూడా పరిగణనలోకి తీసుకోబడతాయి.

    ఆగష్టు నెలాఖరు వరకూ జల్లెడపై వేసిన అన్ని ఓట్లూ పరిగణనలోకి తీసుకుంటాము. ఆ తరువాత ప్రతి విభాగంనుండి పది ఉత్తమాంశాలను తరువాతి రౌండ్ కు ప్రమోట్ చేస్తాము. ఈ పది ఉత్తమాంశాలనుండి మొదటి మూడింటినీ జడ్జిలు ఎన్నుకుంటారు. సెప్టంబర్ మూడవవారం ఫలితాల ప్రకటన ఉంటుంది.

    జడ్జిలుగా బ్లాగ్ ప్రపంచంతో పెద్దగా సంబంధంలేని వారిని ప్రయత్నిస్తున్నాము.

    న్యాయ నిర్ణేతలకు విచక్షణాధికారాలున్నాయి.

    టపా మొదటిసారిగా బ్లాగులోనే ప్రచురితం అయి ఉండాలి.

    - తవసం (తరచూ వచ్చే సందేహాలు)

    * నా బ్లాగు జల్లెడలో లేదు. ఎలా?

    - ఇక్కడకి వెళ్లి కలపమని అడగండి.

    * నా బ్లాగు టపాలు సరి అయిన వర్గంలో లేవు. ఎలా?
    - మీ బ్లాగు టపాకి ఇచ్చిన వర్గాలని బట్టి జల్లెడ వర్గీకరణ చేస్తుంది. మీ బ్లాగు టపాకి అసలు వర్గాలే లేకుంటే ఇప్పుడు అర్థవంతమైన వర్గాలు కలపండి. ఒక వేళ వర్గాలు ఉన్నా జల్లెడ వర్గీకరణ సరిగ్గా చెయ్యకపోతే మరో రెండు మూడు అర్థవంతమైన వర్గాలు కలిపి చూడండి.

    * మళ్లా వర్గాలు కలిపితే కూడలిలో వస్తుంది కదా! ఎలా?

    - ఈ ఒక్కసారికీ లెంపలేసుకోని కలిపెయ్యండి.

    * నా బ్లాగునూ బ్లాగు టపాలనూ ఓటింగ్ కోసం ప్రమోట్ చేసుకోవచ్చా?

    - భేషుగ్గా చేసుకోవచ్చు.
    (అ) ఇక్కడ ఉన్న బొత్తాలు మీ బ్లాగులో ఉంచితే మీ బ్లాగు సందర్శకులు నేరుగా మీ టపాలకు వెళ్లి వోటు వెయ్యవచ్చు.

     

     

     jalledaScreen

     

    (ఆ) జల్లెడలో ఉన్న ఒక కూల్ ఫీచర్ ఏమిటంటే ప్రతి బ్లాగు, ప్రతి రచయిత, ప్రతి బ్లాగు టపా, కూడా శాశ్వత లంకె కలిగి ఉంటుంది. ఈ లంకెని ఉపయోగించి మీరు మీ బ్లాగును ప్రమోట్ చేసుకోవచ్చు. (పై చిత్రంలో కుడివైపున చూడండి. )

    తెర తీశాం.
    పోటీ మొదలయింది.
    విజేతలెవ్వరు?

    uttama-telugu-blaagu-Tapaa

  • మహిళలకు మాత్రమే ప్రవేశం (మహిళా బ్లాగర్ల మీట)

    జల్లెడలో మహిళల కోసం ఓ ప్రత్యేక వర్గం ఏర్పాటు చేసినట్టు మీకు విదితమే. ఆ వర్గాన్ని మీ మీ సైట్లలో ప్రమోట్ చేసుకోడానికిప్పుడో అందమైన మీట/బొత్తం.

    ప్రస్తుతానికి 25 మంది మహిళా బ్లాగర్లే ఉన్నా వారి సంఖ్యను ఇతోధికంగా పెంచి ఆకాశంలో సగం అని బ్లాగ్ప్రపంచంలో (సుమారుగా ఇంకో 800 మంది కావాలి!)  కూడా సగం అని నిరూపించుకుంటారని ఆశిస్తూ

    జల్లెడ బృందం. 


    <a href="http://jalleda.com/jcustcat.php?catid=7" mce_href="http://jalleda.com/jcustcat.php?catid=7"><img border=0 src="http://www.jalleda.com/images/jmahila.png" mce_src="http://www.jalleda.com/images/jmahila.png" alt="మహిళా బ్లాగర్లు ">
    </a>

    ఈ పై డబ్బాలోని కోడ్ మీ సైడ్ బారులో అతికిస్తే మీకు క్రింద చూపిన విధంగా అందమైన బొత్తం ప్రత్యక్ష్యం అవుతుంది. దానిని నొక్కితే మీ చదువరులు నేరుగా మహిళా బ్లాగర్ల వర్గానికి వెళ్తారు.

    మహిళా బ్లాగర్లు

    Visit :  http://jalleda.com/

    mahiLalaku-maatramE-pravESaM

  • ప్రకటన: జల్లెడ బీటా! (వర్గాలు, మెరుగైన వోటింగ్)

    http://jalleda.com/

    తెలుగు బ్లాగులను జల్లించాలనే మాలక్ష్యంవైపు మరో అడుగు వేస్తూ మేము తరువాతి వర్షన్ బీటా మీ ముందుకు తెస్తున్నాము.

    దీనిలోని కొత్త ఫీచర్లు:
    1. వర్గాలు !
    2. మెరుగైన్ వోటింగ్!!

    3. ఇంకొంచెం చూడచక్కని రూపు
    4. పత్రికలకు మరో సెక్షన్
    5. మహిళా బ్లాగర్లకు ఓ సెక్షన్
    6. కొత్త బాబులకు మరో సెక్షన్!! (ఆన్ పాపులర్ డిమాండ్ )

    Visit now http://jalleda.com

    ఓ సారి పరిశీలించి మీ అమూల్యమైన సలాహాలూ, సూచనలూ ఇవ్వగలరని ఆశిస్తూ,
    - జల్లెడ బృందం

    prakaTana-jalleDa-beeTaa

  • jalleDa ippuDu RTS lO kooDaa జల్లెడ ఇప్పుడు RTS లో కూడా

       image        image

    మీ అభిమాన బ్లాగు సంకలిని జల్లెడ ఇప్పుడు బ్లాగులను RTS లోకూడా చూపిస్తుంది. RTS జల్లెడను ఒక సారి దర్శించి మీ అభిప్రాయాలను మాకు అక్షింతలుగా తెలియజేయండి.

    జల్లెడ లంకె – http://www.jalleda.com

    క్రొత్త RTS జల్లెడ లంకె – http://www.jalleda.com/rts

    mee abhimaana blaagu saMkalini jalleDa ippuDu blaagulanu RTS lOkooDaa choopistuMdi. RTS jalleDanu oka saari darSiMchi mee abhipraayaalanu maaku akshiMtalugaa teliyajaeyaMDi.

    jalleDa laMke – http://www.jalleda.com

    krotta RTS jalleDa laMke – http://www.jalleda.com/rts

    jalleda-ippudu-rts-lo-koodaa-jalleDa-ippuDu-rts-lO-kooDa

  • జల్లెడ జల్లించడం మొదలు పెట్టింది

    తెలుగు బ్లాగులను జల్లించడానికొక జల్లెడ రాబోతుందని ప్రకటించి నేటికి సరిగ్గా ఒక నెల గడచినది. మేమన్నట్లుగానే తెలుగు బ్లాగులను జల్లెడ మొలక(alpha) జల్లించడం మొదలు పెట్టిందని తెలియజేయుటకు సంతోషించుచున్నాము. మీరు ఈ జల్లెడను ఉపయోగించి తాజా తెలుగు బ్లాగులను చూడగలగడమే కాక, పాత బ్లాగులను కూడా చదివి ఆనందించవచ్చు.  

    ఇంతేకాక దీనిలో ఉన్న మరో సౌలభ్యం టపాలను బ్లాగుల వారీగా మరియు రచయితల వారీగా జల్లించగలగడం. జల్లెడలో ప్రతి టపాతోపాటుగా కనిపించే బ్లాగు పేరు మీద నొక్కితే ఆ బ్లాగులోని టపాలు మాత్రమే కనిపిస్తాయి. అదే విధంగా రచయిత పేరుని నొక్కితే ఆరచయిత వ్రాసిన టపాలు మాత్రమే కనిపిస్తాయి. 

    పైన చేప్పినట్లుగా ఇది కేవలం మొలక మాత్రమే! మీయందరి సహాయ-సహకారాలతో దీన్నొక మహావృక్షముగా మార్చాలని మా అభిమతం. కాబట్టి జల్లెడ నచ్చినా, నచ్చకపోయినా మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు చేరవేయ ప్రార్ధన. మా ఈ-చిరునాయా తెలుసు కదా? admin at jalleda dot com లేదా jaalayya at gmail dot com. 

    మరి ఇంకెందుకాలస్యం, ఇప్పుడే http://www.jalleda.com కి వెళ్ళండి, మీ అభిప్రాయాలను మాకు తెల్పండి.

    jalleDa-jalliMchaDaM-modalu-pa

  • విన్నపం

    జల్లెడ డైరెక్టరీలో నూరుపైగా లింకులు వచ్చినాయి.

    ఈ సందర్భముగా సభాముఖంగా అందరినీ మరొక్కసారి మీ మీ బ్లాగులను జల్లెడలో ఉంచమని కోరుకుంటున్నాను. తద్వారా తెలుగు బ్లాగ్లోకానికి ఓ డైరెక్టరీగా ఉండాలనే మా ఆశయానికి దగ్గరగా వెళ్ళే అవకాశం వస్తుందని మా ఆశ!

    ఈ సందర్బముగా ఓ ముక్క మనవి చేసుకుంటున్నాము మీరు ఇచ్చే ఈ-ఉత్తరము ను ఎటువంటి స్పాములు పంపడానికి వాడము, వేరే ఎవరికీ దానిని తెలియనివ్వము అని. మీకు వచ్చే ఒకే ఒక ఉత్తరం మీ సైటు నిజనిర్ధారణ కమిటీ చూసిన తరువాత పంపించే ఉత్తరం! ఈ ఉత్తరంలో వచ్చిన  దీనిలోని కోడు మీ బ్లాగు నందు ఉంచడం ద్వారా మీ బ్లాగునకు మరో బొత్తం తగిలించి ఉభయ తారకంగా లాబం కలిగించ విన్నపము.

    ఇప్పటికే చాలా మంది బ్లాగులకు ఈ డైరెక్టరీకి ఐదు నుండి పదికి పైగా హిట్లు వెళ్ళినాయి, కనుక మీరు కూడా మీ బ్లాగు ఇక్కడ కలిపి మరో కొంత మందికి చేరుకుంటారు అని ఆశిస్తున్నాము.

    – తెలుగు లోకానికి మా చేతనైనంత సాయం చెయ్యాలనుకునే పార్ట్ టైం గాళ్ళు

    ఆసక్తికరమైన లెక్కలు

    మొత్తం సైటులు == 100
    అందులో బ్లాగులు > 60
    వేరే బ్లాగుల నుండి జల్లెడకు వచ్చిన వారు 77, సుమారుగా బ్లాగుకు ఒక్కరు
    జల్లెడ నుండి వేరే సైటుకు వెళ్ళిన వారు 391 , రమారమి సైటుకు నాలుగు సార్లు వెళ్ళినారు.
    చేసిన అన్వేషణలు 85
    ఎక్కువగా అన్వేషించిన పదము శోధన (నయినా సుధాకరూ, ఇక్కడ కూడా ఉత్తమ బ్లాగరువేనా?)

    vinnapaM

RTSMirror Powered by JalleDa