జల్లెడ బ్లాగు
Jalleda.com గురించిన తాజా సమాచారం-
మీరు తెలుగు బ్లాగుల్లో చేసిన వ్యాఖ్యలు ట్రాక్ చెయ్యటం
Posted on October 5th, 2009 4 వ్యాఖ్యలుతెలుగులో బ్లాగులు రెండు వేలు దాటి శర వేగంతో ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటి వరకు మన వాళ్లు సుమారుగా 80,000 టపాలు, అనగా అక్షరాలా యనభై వేల టపాలు వ్రాశారు. ఇంకా మన బ్లాగ్ పాఠకులు సుమారుగా మూడున్నర లక్షల వ్యాఖ్యలు వ్రాశారు! అనగా రమారమి ఒక్కొక్క టపాకు నాలుగు వ్యాఖ్యలు వస్తున్నాయి. మన బ్లాగ్ పాఠకులు తీరిక సమయాల్లో బ్లాగులు చదువుతూ నచ్చినప్పుడు, నచ్చనప్పుడు, మూడ్ ఉన్నప్పుడు వ్యాఖ్యలు వివిధ బ్లాగుల్లో వ్రాస్తున్నారు. కానీ ఈ వ్యాఖ్యలకు బ్లాగ్ రచయిత గానీ, లేదా మరో బ్లాగ్ పాఠకుడు గానీ సమాధానం ఇచ్చినాడో లేదో అని ట్రాక్ చెయ్యటం కూసింత కష్టంగా ఉన్నట్టుంది. నిజానికి ఈ పనిని జల్లెడను ఉపయోగించుకోని తేలిక చేసుకోవచ్చు. వివరంగా ఈ దిగువ ఇస్తున్నాము పరిశీలించి వాడి మీ అభిప్రాయాలు చెప్పగలరు.
ఒక్కా ఓ చెలియా :
ముందుగా http://jalleda.com నకు వెళ్లి కొంచెం పేజీ దిగువకు వచ్చి ఎడమ వైపున శోధన పెట్టె ఉంది చూడండి.
రెండు రోకళ్లు :
ఆ తరువాత ఆ శోధన పెట్టెలో మీరు
“రచయిత వ్యాఖ్యలు: AUTHOR_NAME”
అని టైప్ చేసి అన్వేషించండి. ఇక్కడ AUTHOR_NAME అని ఉన్న దగ్గర మీ పేరు టైప్ చేసుకోండి. (మీ పేరు అంటే మీరు వివిధ బ్లాగుల్లో వ్యాఖ్యానించేటప్పుడు వాడే పేరన్నమాట. ఉదాహరణకు నేను జాలయ్య పేరుతో అన్వేషిస్తే వచ్చిన ఫలితాలు చూడండి.
మూడు ముద్దబంతి :
ఈ ఫలితాల్లో మొదటిది మీరు ఇప్పటి వరకు చేసిన వ్యాఖ్యలు అయి ఉంటాయి. లేకుంటే రెండు మూడు ఫలితాలు కూడా పరిశీలించగలరు. ఈ విధంగా మీరు ఎక్కడెక్కడ ఎప్పుడు వ్యాఖ్యానించారో చూసి ఆయా పేజీలకు వెళ్లి మీకు ఏమన్నా రిప్లైలు వచ్చాయేమో చూసుకోవచ్చు.
ఆనంద జాల విహారం.
-
ప్రవేశ పెడుతున్నాం http://top.jalleda.com !
Posted on September 30th, 2009 వ్యాఖ్యలు లేవుప్రవేశ పెడుతున్నాం http://top.jalleda.com
జల్లెడలో నచ్చిన టపాలకు ఫైవ్ స్టార్లు, నచ్చని టపాలకు సింగిల్ స్టార్లు ఇవ్వవచ్చునన్న విషయం మీకు తెలుసు. అలాగే ఇప్పటి వరకు, ఈ వారం టాప్ టపాలు చూడాలంటే http://www.jalleda.com/index.php?order=7 అనే లింకు నొక్కి చూసుకోవచ్చు. కాని ఈ లింకు గుర్తు ఉంచుకోవటం కష్టంగా ఉంది. అందుకని http://top.jalleda.com అనే కొత్త చిన్న అర్థవంతమైన ఉప డొమైన్ సృష్ఠించాము.
ఇక నుండి ఈ వారం టాప్ టపాలు చూసుకోవాలంటే దర్శించండి. http://top.jalleda.com
-
జల్లెడ వ్యాఖ్యల్లో సమస్య
Posted on July 20th, 2009 వ్యాఖ్యలు లేవుమా హోస్టింగ్ వాడు డబ్బాను మార్చాక, వ్యాఖ్యల్లో సమస్యగా ఉంది.
అసౌకర్యానికి క్షమించగలరు. త్వరలోనే సరిచేస్తాము.
[update]
This issue is fixed now.
-
జల్లెడ ఇప్పుడు ట్విట్టర్ పై
Posted on June 17th, 2009 వ్యాఖ్యలు లేవుఇప్పుడు జల్లెడ గురించిన తాజా సమాచారం ట్విట్టర్ పై!
-
Jalleda Now for Indians blogging in English
Posted on May 15th, 2009 1 వ్యాఖ్యWe are proud to announce Jalleda English blog aggrator for Indians writing in English.
We are still experimenting with this, please expect glitches.
Have a look at http://jalleda.com/en
-
జల్లెడ క్రొత్త రూపు
Posted on March 1st, 2009 25 వ్యాఖ్యలుమీరు మెచ్చిన జల్లెడ, ఇప్పుడు మీకోసం మరింత ఆహ్లాదకరమైన రూపంతో సిద్దమయింది. కేవలం క్రొత్తరూపే కాకుండా జల్లెడ ఉపయోగశీలత పెంపొందించడానికై కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. ఈ దఫాలో చేసిన కొన్ని మార్పులు
1. క్రొత్త రూపం
జల్లెడలోని టపాలు, వ్యాఖ్యలు జల్లిస్తూ వెళ్లేటప్పుడు మీరు దారి తప్పిపోకుండా ఈ ఏర్పాటు చేయడమైనది.
3. వేడి పకోడీలను చూపడంలో మరింత మెఱుగైన పద్దతి
జల్లెడను వాడి మీ అభిప్రాయాలను తెలియజేయండి.
-
జల్లెడలో ఇప్పుడు వేడి పకోడీలు! మరియు మేఘాలు
Posted on February 22nd, 2009 వ్యాఖ్యలు లేవునిరంతర వాహినిలా వస్తున్న తెలుగు బ్లాగుల నుండి వేడి వేడి పకోడీలు ఏరి జల్లెడలో ఇస్తున్నాం. పరిశీలించి మీ అభిప్రాయం చెప్పగలరు.
ఇంకా మేఘాలు కూడా ఇస్తున్నాం. పరిశీలించగలరు.
-
బ్లాగర్లకు జల్లెడ నుండి కొన్ని సూచనలు కొన్ని విన్నపాలు.
Posted on February 17th, 2009 5 వ్యాఖ్యలుతెలుకు బ్లాగుల చదువరులను పెంచటానికి, చదువరులకు సహాయకారిగా ఉండటానికీ జల్లెడ కృషి చేస్తున్న విషయం విదితమే. ఈ దిశగా చేసే ప్రయత్నాలకు జల్లెడ మీ సహాయం కోరుకుంటుంది. వివరాలు:
మీరు బ్లాగు వ్రాసేటప్పుడు ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోగలరు.
1. శీర్షిక
చాలా టపాలు శీర్షిక లేకుండా వస్తున్నాయి. శీర్షిక ఉంటే మీ టపాలో ఏమి వ్రాశారో పాఠకులకు చక్కగా అర్థం అవుతుంది, మరింత మంది మీ బ్లాగును జల్లెడనుండి దర్శించవచ్చు. అలాగా ఈ శీర్షికల వల్ల మరో ముఖ్యమైన ఉపయోగం శోధన యంత్రాలు శీర్షికకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాయి. అనగా మీరు మా ఊరు గురించి అని టపాలో వ్రాసి మరొకరు మా ఉరు గురించి అని శీర్షికలో వ్రాస్తే శోధన యంత్రాలు ముందు శీర్షికలో ఉన్న వారికి ప్రాముఖ్యత ఇస్తాయి. శీర్షిక లేని టపా తల లేని మనిషి లాంటిది అని గుర్తుంచుకొని ఎల్లప్పుడూ శీర్షిక ఉంచండి.
2. బొమ్మకు వివరణ
కొన్ని టపాలు కేవలం ఒక బొమ్మ మాత్రమే కలిగి ఉంటాయి. కాని సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం జల్లెడలో బొమ్మలు చూపటం లేదు. కనుక మీరు బొమ్మతో పాటు కొంత వివరణ కూడా వ్రాస్తే మరింత మంది చదువరులను పొందవచ్చు. ఆలాగే ఇలా వివరణ వ్రాయటం బొమ్మలను శోధన యంత్రాలకు కూడా పనికి వస్తుంది.
3. వర్గాలు
బ్లాగ్ ప్రపంచంలో వర్గాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే జల్లెడలో కూడా ఈ వర్గాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు గమనించినట్టు పైన ఉన్న రకరకాల వర్గాలలోకి మీ బ్లాగు వర్గీకరించాలంటే మీ బ్లాగుకు తగ్గ వర్గాలు చేర్చాలి. వర్గాలు పని చేసే విదానం కోసం మా పాత టపా చూడండి.
4 వోటు హక్కు ఉపయోగించుకోండి. జల్లెడలో ప్రతి టపా కుడి పక్కన ఐదు నక్షత్రాలు ఉన్నాయి చూశారూ, వాటిని ఉపయోగించుకొని ఓటు వెయ్యవచ్చు. ఇలా ఓటు వేయటం వల్ల మీరు ఉత్తమ టపాలు ఇతరులకు రికమెండ్ చెయ్యవచ్చు. వోటు వివరాలు మా పాత టపాల్లో చదవండి.
5. మీ బ్లాగులో జల్లెడ బొత్తం ఉంచండి. ఈ లంకెలో మీకు నచ్చిన బొత్తం పెడ్డుగోవచ్చు. అలాగే ఇక్కడ చెప్పిన బొత్తాలు పెట్టుకుంటే మీ పాఠకులు నేరుగా మీ టపాలు మాత్రమే చూసి మీ టపాలకు మాత్రమే ఓట్లు వెయ్యవచ్చు ఈ సరికే బొత్తాలు కుట్టుకున్నవారికి నెనర్లు.
6. పత్రికలు విభాగం చూడటం మరవకండి. వీటిలోని టపాలు మెయిన్ పేజీలో కనిపించవు.
7. మీరు గానీ స్త్రీ బ్లాగరు అయితే మీ టపాలు స్త్రీ బ్లాగుల విభాగంలో వస్తున్నాయో లేదో పరిశీలించి, రాకుంటే మాకు చెపితే కలుపుతాము.
8. పరిశీలించండి. మీ టపాలు సరిగ్గా వస్తున్నాయో లేదో, మీ వ్యాఖ్యలు సరిగ్గా వస్తున్నాయో లేదో, మీ బ్లాగు నుండి వ్యాఖ్యలు సరిగ్గా వస్తున్నాయో లేదో ఒక సారి సరి చేసి ఏమైనా బగ్గులు ఉంటే మాకు తెలియచెయ్యండి.
9. అలాగే మీకు తెలిసిన వారికి జల్లెడ లింకు పంప ప్రయత్నించగలరు.
-
ఎక్కువ వ్యాఖ్యలు పొందిన టపాలు కొన్ని.
Posted on February 11th, 2009 వ్యాఖ్యలు లేవుజల్లెడ ఇప్పుడు వ్యాఖ్యలు కూడా చూపుతుందనిమీకు తెలుసు. ఎక్కువ వ్యాఖ్యలు వచ్చిన కొన్ని టపాలు మీకోసం ఇక్కడ అందజేస్తున్నాము.
ఈ జాబితాను తయారు చేయడం కోసం, 50 వ్యాఖ్యలు కన్నా ఎక్కువ ఉన్న బ్లాగు టపాలు పరిశీలించాము.
ఒకే బ్లాగు నుండి ఒకటి కంటే ఎక్కువ టపాలు ఉంటే, కేవలం ఒక్కటే ఇచ్చాము.
ర్యాంకు బ్లాగు టపా పేరు, లింకు బ్లాగు పేరు, ఇతర టపాలు కామెంట్ల సంఖ్య 1. ఓ జాలిలేని నేస్తమా… ! శ్రీసత్య… 111 2. మీ చదువులే మా చావులు! సుజాత 110 3. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ Cbrao 103 4. ప్రస్తుతం పని చెయ్యటం లేదు. పానశాల 90 5. వివాహ భోజనంబు – వింతైన వంటకంబు రెండు రెళ్ళు ఆరు 81 6. . మన భద్రతే మనకు ముఖ్యం చదువరి 69 7. గోంగూర పప్పు – కుంపటి నల భీమ పాకం 65 8. ఉప్మా పురాణం అప్పుడు ఏమి జరిగిందంటే.. 63 9. నేను ఎందుకు ప్రేమించలేదంటే…..??? MEENAKSHI 62 10. నా బ్లాగు సొంత డబ్బా ! గడ్డిపూలు 55 11. నేను – సులక్షణ రెడ్డి (ఓ ప్రేమ కథ) ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల … 53 12. స్నేహం స్నేహమా…. 51 -
RTS Mirror – word press plugin vext version 1.1 released
Posted on February 10th, 2009 వ్యాఖ్యలు లేవుIt is almost one year we first released RTSMirror plugin for wordpress self hosted people. Still it is working good!
When we released this plugin the version of wordpress is 2.2 now it is 2.7.
These are the changes in new release
1. Tested on wordpress 2.7.
2. Fixed a bug reported by poddu people. Now we give link to Telugu script in RTS page and vice-versa. Previously we used to give only RTS link always.
3. Now we display Title instead of a static string (RTS Perm Link, in previous versions now Title of page in Telugu and RTS )
4. RTSMirror widget is now more intuitive.
Visit RTSMirror Home page to download and install instructions. Make sure you added widget in appearance page.
Incase you own a wordpress self hosted domain, install and see it in action.
One can play around RTS feature on this blog to see this in action.
Advantages:
1. One who can not read Telugu script can still read your blog in roman script.
2. If ones machine doesn’t display Telugu script properly still your blog can be read. (for example somebody on mobile!)
3. if somebody is searching for Telugu content in English script your blog is visible!
People who are already using this, please share your feedback here. Also it will be great if you can give us stats of how many more people visited your blog through search engines via RTS content.



